అక్షర టుడే, ఎల్లారెడ్డి: Jukkal MLA | పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (MLA Thota Lakshmi Kantarao) అన్నారు.
డోంగ్లీ మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ (Shaadi Mubarak) చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.