Homeజిల్లాలుకామారెడ్డిMLA Madanmohan Rao | ఎల్లారెడ్డికి త్వరలో బస్‌డిపో

MLA Madanmohan Rao | ఎల్లారెడ్డికి త్వరలో బస్‌డిపో

- Advertisement -

అక్షర టుడే, ఎల్లారెడ్డి: MLA Madanmohan Rao | మండలకేంద్రంలో ఎట్టకేలకు ఆర్టీసీ బస్‌డిపో (RTC bus depot) ఏర్పాటు కానుంది. ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజలు బస్‌డిపో ఏర్పాటు కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ రావు (MLA Madanmohan Rao) సైతం సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను (Minister Ponnam Prabhakar) కలిసి విన్నవించారు.

దీంతో స్పందించిన ప్రభుత్వం ఇటీవల రూ.5 కోట్ల వ్యయంతో కొత్త బస్టాండ్‌ (New Bus Stand) నిర్మించింది. అలాగే బస్సుల సంఖ్య పెంచాలని సైతం ఎమ్మెల్యే విన్నవించగా, స్పందించిన మంత్రి బాన్సువాడ, కామారెడ్డి డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎల్లారెడ్డికి అదనంగా 10 కొత్త బస్సులను కేటాయించారు. 30ఏళ్ల కిందట డిపో నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో బస్‌డిపో ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Must Read
Related News