అక్షరటుడే, ఇందూరు: Municipal Elections | ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా తుది ఓటరు జాబితాను (final voter list) పక్కాగా రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులకు సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒక్కో వార్డువారీగా ఓటరు జాబితాను రూపొందించాలన్నారు.
Municipal Elections | మార్గదర్శకాలకు అనుగుణంగా..
ఎన్నికల సంఘం (Election Commission) నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ముసాయిదా జాబితాను ప్రదర్శించాలని కలెక్టర్ తెలిపారు. ఈనెల 12వ తేదీన తుది ఓటరు జాబితా వెలువరించాలని సూచించారు. బోగస్ ఓటర్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ అనవసర తప్పిదాలకు తావు కల్పిస్తే సంబంధిత బూత్ లెవెల్ అధికారులను,సూపర్వైజర్లను బాధ్యులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, కమిషనర్ శ్రావణి, తహశీల్దార్ సుజాత తదితరులు పాల్గొన్నారు.