అక్షరటుడే, కోటగిరి: Kotagiri | తెలంగాణ ప్రభుత్వం (Telangana government) జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడమంటే పత్రికా స్వేచ్ఛను కాలరాయడమేనని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాదేపురం గంగన్న (president Kadepuram Ganganna) అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు జర్నలిస్టులకు ప్రాధాన్యత, గౌరవం ఉండేదని, ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వాలు జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా టీన్యూస్ బ్యూరో సాంబశివరావుపై అక్రమ కేసులు నమోదు చేసినందుకు అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు.