అక్షరటుడే, వెబ్డెస్క్: Minister Uttam Kumar | తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు తాము పోరాడుతున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్పై ( Banakacharla project) కేంద్రానికి ఇప్పటికే లిఖిత పూర్వక ఫిర్యాదు చేశామని చెప్పారు. అలాగే ఆలమట్టి ఎత్తు పెంపునకు వ్యతిరేకంగా కూడా తాము ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.
బనకచర్లపై బీఆర్‌ఎస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. అవాస్తవాలు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం మానుకోవాలని హరీశ్ రావుకు (Harish Rao) సూచించారు. హనుమకొండలో మంత్రి ఉత్తమ్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి పార్టీ వ్యతిరేకమని తాము మొదటి నుంచి చెబుతున్నామని గుర్తు చేశారు. బనకచర్లపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం (AP government) ఎట్టి పరిస్థితుల్లో కట్టకుండా చూస్తామన్నారు.
Minister Uttam Kumar | కాళేశ్వరం ఉపయోగించకున్నా భారీగా పంటలు..
పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) చేసిందేమీ లేదని ఉత్తమ్ మండిపడ్డారు. పదేళ్లలో వారు చేసింది కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం తప్ప ఇంకేమీ చేయలేదన్నారు. ఆ ప్రాజెక్టు కూడా మూడేళ్లకే కూలిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలో లేకపోయినా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండించారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram project) ఉపయోగించకుండా రికార్డ్ స్థాయిలో పంటను పండిస్తున్నామని, 148.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈసారి ఉత్పత్తి కానుందని చెప్పారు. గత 22 నెలల్లో కాళేశ్వరం ప్రాజక్ట్ నయాపైసా కూడా పనికి రాలేదన్నారు. హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో గోదావరి జలాలను ఆంధ్రకు అప్ప జెప్పారని గుర్తు చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా నీటిని తాము కాపాడుకుంటామని తెలిపారు. హరీశ్ రావు తప్పడు మాటల ద్వారా అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Minister Uttam Kumar | కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణకు మేలు..
బీఆర్ఎస్ కట్టిన ఏకైక కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ (Medigadda) కూలిపోయిందని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ తుమ్మడిహెట్టి వద్ద తట్టెడు మట్టి ఎత్త లేదని విమర్శించారు. గోదావరి జలాల విషయంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే (Congress government) తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. హరీశ్ రావు ఏదేదో మాట్లాడుతున్నాడని, గోదావరి, కృష్ణ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నదన్నారు.
బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), తాను తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రప్రభుత్వంతో కోట్లాడుతున్నామని తెలిపారు. తమ హయాంలోనే సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేశామని, సమ్మక్క, సారలమ్మ ప్రాజెక్ట్ విషయంలో అన్ని అనుమతులు సాధిస్తున్నామని తెలిపారు. వరంగల్ నగరానికి ఎయిర్ పోర్ట్ కట్టి చారిత్రక నగరాన్ని మరో స్థాయికి తీసుకెళుతున్నామని ఉత్తమ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దేశంలోనే ఎక్కువ పంటను ఉత్పత్తి చేస్తున్నది మన రాష్ట్రమని చెప్పారు.