Fighter Jet Crash
Fighter Jet Crash | అమెరికాలో కుప్పకూలిన యుద్ధ విమానం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fighter Jet Crash | అగ్రరాజ్యం అమెరికాలో యుద్ధ విమానం కుప్పకూలింది. అత్యంత ఆధునికమైన ఎఫ్​–35 ఫైటర్​ జెట్​ కాలిఫోర్నియాలో (California) కూలిపోయింది.

ఈ ప్రమాదంలో పైలెట్ (Pilot)​ సురక్షితంగా బయట పడ్డాడు. కాలిఫోర్నియాలోని నావల్ ఎయిర్ స్టేషన్ (Naval Air Station) సమీపంలో అమెరికా నౌక దళానికి చెందిన ఎఫ్-35 యుద్ధ విమానం కూలిపోయింది. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6:30 గంటలకు లెమూర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎఫ్-35 పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఈ విమానాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విమానం కూలడంతో భూమిపై ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు.

Fighter Jet Crash | భారత్​లో నిలిచిన ఎఫ్​–35

బ్రిటిష్​ యుద్ధ విమానం ఎఫ్​–35 ఇటీవల భారత్​లో రోజుల తరబడి నిలిచి పోయిన విషయం తెలిసిందే. ఇంధనం అయిపోవడం, సాంకేతిక సమస్యలతో పైలెట్​ విమానాన్ని కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేశాడు. అయితే విమానంలో ఇంధనం నింపిన తర్వాత కూడా అది ఎగరేక పోయింది. హైడ్రాలిక్​ వ్యవస్థలో సాంకేతిక లోపంతో విమానం నిలిచిపోయింది. దీంతో బ్రిటిష్​ రాయల్​ నేవికి చెందిన నిపుణులు రోజుల తరబడి శ్రమించడంతో 35 రోజుల తర్వాత ఎఫ్​–35 టేకాఫ్​ అయింది. 35 రోజులు విమానాన్ని పార్క్ చేసినందుకు తిరువనంతపురం ఎయిర్​పోర్ట్​ బ్రిటిష్​ నేవి నుంచి రోజుకు రూ.26,261 చొప్పున అద్దె వసూలు చేశారు.

Fighter Jet Crash | అధునాతన విమానాల్లో లోపాలు

అమెరికా (America) ఎఫ్​–35 యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ప్రపంచంలో ఇవి అత్యంత అధునాతన విమానాలని అగ్రరాజ్యం చెబుతోంది. అయితే ఈ విమానాల్లో తరచు సాంకేతిక సమస్యలు వస్తుండటంతో ఆందోళన నెలకొంది. ఇటీవల భారత్​లో ఇంగ్లాండ్​కు చెందిన ఎఫ్​–35 విమానం 35 రోజులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కాలిఫోర్నియాలో ఫైటర్​ జెట్(Fighter Jet)​ కూలిపోయింది.

ప్రస్తుతం ఉన్న యుద్ధ విమానాల్లో వీటికే అధిక ధర ఉంది. అంతేగాకుండా వీటి నిర్వహణ ఖర్చు కూడా బాగానే ఉంది. అంతపెట్టి కొనుగోలు చేసినా సాంకేతిక సమస్యలు తలెత్తుండడంతో పలు దేశాలు ఆలోచిస్తున్నాయి. 2025 ప్రారంభంలో అలాస్కాలో F-35A కూలిపోయింది. గతంతలో దక్షిణ కరోలినా, జపాన్‌లో యుద్ధ విమానాలు కూలిపోయాయి.

Fighter Jet Crash | భారత్​ ఇచ్చేందుకు అంగీకారం

అమెరికా ఎఫ్​–35 యుద్ధ విమానాలను భారత్​కు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఇప్పటికే పలు దేశాలు అమెరికా నుంచి వీటిని కొనుగోలు చేశాయి. అయితే భారత్​ మాత్రం కొనుగోలుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఇండియా ఫ్రాన్స్​ నుంచి రాఫెల్​ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న సుఖోయ్​ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో సేవలు అందిస్తున్నాయి.