HomeUncategorizedIAF | గంగా ఎక్స్​ప్రెస్​ వేపై యుద్ధ విమానాల విన్యాసాలు

IAF | గంగా ఎక్స్​ప్రెస్​ వేపై యుద్ధ విమానాల విన్యాసాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAF | పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత భారత్​ యుద్ధ కసరత్తులు తీవ్రతరం చేసింది. సరిహద్దులో భారీగా సైన్యాన్ని, యాంటీ డ్రోన్​ వ్యవస్థ, జామర్లను మోహరించింది.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ganga express way up భారత వైమానిక దళం IAF ఫ్లైపాస్ట్ నిర్వహించింది. యుద్ధం, జాతీయ అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ రన్‌వేగా ఎక్స్‌ప్రెస్‌వే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ విన్యాసాలు విజయవంతంగా పూర్తి చేసింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లో shahjanpoor 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌స్ట్రిప్‌ గంగా ఎక్స్‌ప్రెస్‌వేలో భాగం. ఈ ఎయిర్‌షో ప్రత్యామ్నాయ రన్‌వేగా ఉపయోగించడానికి ఎక్స్‌ప్రెస్‌వే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడనుంది. ఈ ఎయిర్‌షోలో ఫైటర్ జెట్లు ఒక మీటర్ ఎత్తులో తక్కువ ఫ్లైపాస్ట్‌లను నిర్వహించాయి. తరువాత ల్యాండింగ్, టేకాఫ్ డ్రిల్స్ చేశాయి. శుక్రవారం రాత్రి సమయంలో మరోసారి డ్రిల్ చేయనున్నారు.

Must Read
Related News