అక్షరటుడే, ఇందూరు: Nizamabad | బీసీల హక్కులను సాధించేవరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) నగర అధ్యక్షుడు దేవేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్ చౌరస్తాలో రెడ్డి జాగృతి దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి నాయకులు హైకోర్టులో (High Court) పిటిషన్ వేయడం సిగ్గుచేటన్నారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న న్యాయమైన హక్కులను సాధించే దిశగా అడుగులు వేస్తే అడ్డుపడడం తగదన్నారు.
బీసీ ద్రోహులకు తగిన గుణపాఠం చెబుతామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాకిషన్, రాష్ట్ర నాయకుడు ప్రసాద్, సాయిరాజ్, విజయ్ కుమార్, అజయ్, విజయ్, శ్రీలత, రుక్మిణి, జయ, రవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Nizamabad | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీ కాలయాపన
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై (BC reservation bill) బీజేపీ కాలయాపన చేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ చౌరస్తాలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ కట్టుబడి ఉందని మాట్లాడుతూనే.. మరోవైపు కోర్టులో కేసులు వేయిస్తూ కేంద్రంలో బిల్లును ఆమోదించకుండా అడ్డుకుంటూ డ్రామాలాడుతుందని విమర్శించారు.
బీజేపీకి బీసీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బిల్లుకు తక్షణం ఆమోదం తెలిపి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలన్నారు. ఒక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు (local body elections) నిర్వహించకపోవడంతో గ్రామాల్లో పాలన కుంటుపడిందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బీసీలంతా ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ఓమయ్య, నాయకులు హనుమాన్లు, రఘురాం, అంజలి, రాధా కుమార్, ప్రసాద్, గోవర్ధన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
