ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | మహిళలకు ఇచ్చిన హామీల కోసం పోరుబాట : ఎమ్మెల్సీ కవిత

    MLC Kavitha | మహిళలకు ఇచ్చిన హామీల కోసం పోరుబాట : ఎమ్మెల్సీ కవిత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: MLC Kavitha | ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్​ చేశారు. ఈ మేరకు శనివారం రంగారెడ్డి జిల్లా (Rangareddy District) కేశంపేట్ మండలం కాకునూరు గ్రామంలో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు.

    ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళలందరికీ నెలకు రూ.2,500 ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్​ అగ్రనేత సోనియాగాంధీకి (Congress leader Sonia Gandhi) పోస్టు కార్డులు పంపారు.

    కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం హామీని అమలు చేయాలన్నారు. కోటీ మంది కోటీశ్వరులను చేస్తానని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇవ్వలేని సీఎం కోటీశ్వరులను ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే కాంగ్రెస్​ మాటలు నమ్మి మోసపోయి గోస పడుతున్నామన్నారు. 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలన్నారు.

    MLC Kavitha | పనులు చేయకున్నా బిల్లులు

    కాంగ్రెస్​ హామీల అమలు కోసం పోరాటాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ (Telangana) కోసం ఎన్నో పోరాటాలు చేశామన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్​ను కేసీఆర్​ నిర్మించారన్నారు. 90శాతం పనులు పూర్తయిన ఈ ప్రాజెక్ట్​ పూర్తయితే ఈ ప్రాంత రైతులకు సాగు నీరు వస్తుందన్నారు. అయినా కానీ కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. కొత్తగా కొడంగల్​ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చారని కవిత అన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్​లో పనులు చేపట్టకముందే కమీషన్లు తీసుకొని కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చారని ఆమె ఆరోపించారు.

    MLC Kavitha | కాంగ్రెస్​ వారికే ఇందిరమ్మ ఇళ్లు

    కాంగ్రెస్​ నాయకులకే ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) ఇచ్చారని కవిత ఆరోపించారు. పేదలకు ఇళ్లు ఇవ్వాల్సి ఉన్నా.. కాంగ్రెస్​ కార్యకర్తలకు ఇస్తున్నారన్నారు. రాష్ట్రం పరువు తీసేలా రేవంత్​రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. అప్పు కోసం పోతే దొంగను చూసినట్లు చూస్తున్నారని వ్యాఖ్యలు చేసి రాష్ట్రం పరువు తీస్తున్నారు. ఇప్పటి వరకు రూ.రెండు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్​రెడ్డి ఒక ప్రాజెక్ట్​ కూడా చేపట్టలేదన్నారు.

    సీఎం రేవంత్​రెడ్డి హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన హైడ్రా (Hydraa) పేదల గుడిసెల మీదకు మాత్రమే బుల్డొజర్లు తీసుకొని వెళ్తుందన్నారు. పెద్దొళ్ల దగ్గరికి పోయే దమ్ములేదన్నారు. సీఎం రేవంత్​రెడ్డి అబద్దాలు చేపట్టడం మాని ప్రజల కోసం పనులు చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​కు బుద్ధి చెప్పాలన్నారు.

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...