Homeతెలంగాణfestivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని...

festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారత్​ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.

ముంబయి Mumbai (Lokmanya Tilak Terminus – LTT) నుంచి కరీంనగర్ వరకు (నిజామాబాద్ మీదుగా) నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 01067/01068 వారపు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్ల రాకతో ప్రయాణికుల రద్దీ కాస్త తగ్గనుంది.

festivals Special trains : మరో రాజధాని ఎక్స్‌ప్రెస్..

ఇంకో విశేషం ఏమిటంటే.. మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రాబోతోంది. కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్​ను ప్రారంభించబోతున్నట్లు భారత్​ రైల్వే Indian Railways ప్రకటించింది.

ప్రస్తుతం భారత్​లో 25 రాజధాని ఎక్స్‌ప్రెస్ Rajdhani Express రైళ్లు సేవలు అందిస్తున్నాయి. కొత్తగా ప్రారంభించబోయే రాజధాని ఎక్స్‌ప్రెస్ 26వది.

ఈ రైలు సైరాంగ్ (అయిజాల్, మిజోరాం) (Aizawl, Mizoram) – ఆనంద్ విహార్ టెర్మినల్ (ఢిల్లీ) Anand Vihar Terminal (Delhi) మధ్య నడవనుంది. 26వ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు రాకతో ఈశాన్య భారత్​ North East India నుంచి ఢిల్లీకి అనుసంధానం మరింత మెరుగుకానుంది.