44
అక్షరటుడే, ఇందూరు: Mla dhanpal | పవిత్ర పర్వదినాలు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) అన్నారు. నగరంలోని మౌని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో (Subrahmanyeshwara Swamy temple) కల్యాణం నిర్వహించారు.
Mla dhanpal | ఐక్యతను పెంచుతాయి..
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్కంద షష్టి రోజు (Skanda Shashti day) కల్యాణంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆలయ కమిటీ సభ్యులు మరిన్ని కార్యక్రమాలు చేయాలని సూచించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.