అక్షరటుడే, భీమ్గల్: Fertilizers | రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీపీవో(DPO Srinivas rao), మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు సూచించారు. పట్టణంలోని గ్రోమోర్ వ్యవసాయ ఎరువులు (Gromor Agricultural Fertilizers shops), విత్తనాల దుకాణాలను గురువారం తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాల నిల్వలను పరిశీలించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
Fertilizers | మండలస్థాయి అధికారులతో సమీక్ష
తనిఖీ అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో (Madala Praja Parishad Office) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రేషన్ కార్డులు (Ration shops), ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses), వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖల (Horticulture) పనులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు, వనమహోత్సవం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు పనులు వేగవంతంగా చేసి పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, తహశీల్దార్ షబ్బీర్, ఏవో లావణ్య, ఎంపీవో జావిద్, మెడికల్ ఆఫీసర్ అజయ్, ఏపీవో నరసయ్య, హార్టికల్చర్ అధికారి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.