Homeజిల్లాలునిజామాబాద్​ACP Raja Venkata Reddy | మహిళ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్: ఏసీపీ రాజా...

ACP Raja Venkata Reddy | మహిళ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్: ఏసీపీ రాజా వెంకటరెడ్డి

మహిళ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ACP Raja Venkata Reddy | మహిళ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నవీపేట మండలం ఫతేనగర్ గ్రామ శివారులో గత నెల 24న శ్యామల లక్ష్మిని పెట్రోల్ పోసి దుండగులు హత్య చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

కాగా.. శ్యామల లక్ష్మిని నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన గొల్ల సంగీత, కోస్లి గ్రామానికి చెందిన మంగలి బాబు, పద్మ కలిసి హత్య చేసినట్లు గుర్తించారు. ఈ ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు శ్యామల లక్ష్మి, సంగీత, బాబు, పద్మ మధ్య చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. అందరూ కలిసి పనిచేసుకునేవారు. అయితే కొద్ది రోజుల నుంచి వారి మధ్య డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్యామల లక్ష్మిని చంపాలనే పథకం వేశారు. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న శ్యామల లక్ష్మిని సంగీతతో పాటు మరో ఇద్దరి సహాయంతో గొంతు నలిమి హత్య చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ముగ్గురిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఈ కేసును ఛేదించిన నార్త్ రూరల్ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ బి.శ్రీనివాస్, ఎస్సైలు తిరుపతి, యాదగిరి గౌడ్, రాజశేఖర్, ఏఎస్సైలు గఫర్, రాజేశ్​లను ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి అభినందించారు.