అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Mulugu | ములుగు జిల్లాలో ఓ మహిళా మావోయిస్ట్ పోలీసులకు చిక్కింది. తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట(Karregutta)ల్లో ఇటీవల భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ (Operation Kagar) నిర్వహించిన విషయం తెలిసిందే.
కర్రెగుట్టల్లో దాదాపు వెయ్యి మంది నక్సల్స్ ఉన్నారనే సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు. వేల సంఖ్యలో బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టులు(Maoists) మృతి చెందారు. కర్రెగుట్టల్లో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ మావోయిస్టు చిట్టి అనే మహిళ తప్పించుకుంది. గుత్తికోయగూడెంలో తలదాచుకొని బంధువుల ఇంట్లో రహస్యంగా చికిత్స పొందుతోంది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు(Police) గుత్తికోయగూడెంలోకి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గూడెంలో ఇంకా మావోయిస్టులు ఉన్నారేమోననే అనుమానంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.