అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy RTC Busstand | కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ (Kamareddy Busstand) లో నెలకొన్న సమస్యలపై పాలకులకు పట్టింపు లేకుండా పోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో నడిబొడ్డున ఉన్న ప్రయాణప్రాంగణం వైపు చూసే నాథుడే కరువయ్యారు. బస్టాండ్ లోపలికి, బయటకు వెళ్లే దారులు పూర్తిగా గుంతలమయంగా మారాయి.
Kamareddy Busstand | కనిపించని గుంతలతో పెరుగుతున్న ప్రమాదాలు..
ఈ గుంతల్లో వర్షంనీరు చేరితే అవి పైకి కనిపించట్లేదు. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి ఓ కానిస్టేబుల్ గుంతలో పడి గాయాపాలైంది. పట్టణంలో సాయంత్రం కురిసిన భారీవర్షానికి బస్టాండ్ నుంచి బస్సులు బయటకు వెళ్లేదారిలో ఏర్పడిన భారీ గుంతలో నీళ్లు నిండాయి. బస్టాండ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ (Lady Constable) ఈ దారిలో బయటకు వస్తూ ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయింది. దాంతో అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు వెంటనే స్పందించి గుంతలో పడిపోయిన ఆమెను బయటకు తీసుకువచ్చారు.
Kamareddy Busstand | పాలకులకు పట్టింపే లేదు..
జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్ పరిస్థితి ఇంత అధ్వానంగా మారినా పాలకులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష నాయకులు బస్టాండ్‌పై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే బస్టాండ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
