అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Constable Suicide | ఇద్దరు యువకుల వేధింపులు తాళలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా (Warangal District)లో చోటు చేసుకుంది.వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యాతండాకు చెందిన అనిత వరంగల్ కమిషనరేట్ (Warangal Commissionerate) లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తోంది.
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) తొర్రూర్ మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ ఆమెకు దూరపు బంధువు. అనితను పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా చెబుతున్నాడు. అయితే విధుల్లో ఉండగా.. వీడియో కాల్ చేయాలని, ఇతరులతో చనువుగా ఉండొద్దని నిత్యం వేధించేవాడు. దీంతో అతని తీరు నచ్చని అనిత తల్లిదండ్రులు వివాహానికి నిరాకరించారు.
Constable Suicide | మరో యువకుడితో చనువు..
రాజేందర్‌ను దూరం పెట్టిన అనిత మరో యువకుడితో చనువుగా ఉండటం మొదలు పెట్టింది. తన స్నేహితుడు జబ్బార్ లాల్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని, అతడిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో రాజేందర్ గుర్తించాడు. దీంతో జబ్బర్లాల్కు ఫోన్ చేసి అనిత గురించి తప్పుగా చెప్పాడు. దీంతో జబ్బర్సైతం అనితను వేధించడం మొదలు పెట్టాడు. డబ్బులు ఇస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అనిత మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో రాజేందర్‌కు ఫోన్ చేసింది. “నువ్వు, జబ్బర్‌లాల్ కలిసి నా జీవితాన్ని నాశనం చేశార’ని ఏడ్చింది. చావే దిక్కని కన్నీరు పెట్టుకుంది. అయినా రాజేందర్ పట్టించుకోకుండా చస్తే చావు అంటూ ఫోన్లో అన్నాడు. దీంతో మనస్తాపం చెందిన అనిత ఈ నెల 27 గడ్డిమందు తాగింది.గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజేందర్, జబ్బర్ లాల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.