అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బాత్రూంలో జారిపడి మహిళా కండక్టర్ (Female RTC conductor) మృతి చెందింది. ఈ ఘటన బాన్సువాడ పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ అశోక్(CI Ashok) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని చైతన్య కాలనీలో (Chaitanya Colony) అద్దె ఇంట్లో ఆర్టీసీ కండక్టర్ సాయవ్వ(49) నివాసముంటోంది.
అయితే శుక్రవారం రాత్రి బాత్రూంలో జారిపడడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి (Banswada Area Hospital) తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆమె కుమారుడు బేగరి సాయిచరణ్ తేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.