Homeజిల్లాలునిజామాబాద్​Fee Reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్​ను వెంటనే విడుదల చేయాలి

Fee Reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్​ను వెంటనే విడుదల చేయాలి

పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్​ను విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్​ చేశాయి. ఈ మేరకు నగరంలోని ఎన్టీఆర్​ చౌరస్తా వద్ద నిరసనకు దిగాయి.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Fee Reimbursement | పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్​ను (Fee Reimbursement) వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.

ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తలపెట్టిన బంద్​కు ఏఐఎస్ఎఫ్, ఏఐపీఎస్​యూ మద్దతు తెలుపుతూ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో (NTR Chowrastha) నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐపీఎస్​యూ జిల్లా కార్యదర్శి అనిల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రూ. 8,500 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు.

ప్రభుత్వం రీయింబర్స్​మెంట్​ను విడుదల చేయకపోతే ప్రైవేటు యాజమాన్యాలతో కలిసి విద్యార్థి సంఘాలు ఉద్యమాలను తీవ్రం చేస్తాయని హెచ్చరించారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు వెళ్లాలంటే ప్రైవేట్​ కళాశాలలో (Private College) సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబట్టుకోవాలని కనీసం విడతల వారీగా అయినా బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని (Education Minister) ఇప్పటికీ నియమించకపోవడం సిగ్గుచేటన్నారు. కళాశాలల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించాలని లేకపోతే భవిష్యత్తులో మంత్రుల కార్యాలయాలను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు శుభోద్, కుషాల్, గోపాల్ సింగ్ ఠాగూర్, సునీల్, సుమంత్ అధికారులు పాల్గొన్నారు.