అక్షరటుడే, ఇందూరు: ABVP Nizamabad | రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ శశిధర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల (Giriraj Degree College) ఎదుట శనివారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ. 8,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) పెండింగ్లో ఉందన్నారు. దీంతో పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల హక్కు అని, ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. ప్రజలను మాటలతో మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ఇకనైనా విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే భవిష్యత్తులో ఏబీవీపీ (ABVP) పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందన్నారు. కార్యక్రమంలో కంఠేశ్వర్ జోనల్ ఇన్ఛార్జి దుర్గాదాస్, సన్నీ, సిద్ధు, విగ్నేష్, టోనీ, కార్తీక్, విగ్నేష్, హరీష్, శశాంక్, రంజిత్, లక్కీ తదితరులు పాల్గొన్నారు.
