అక్షరటుడే కామారెడ్డి: Fee reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే నేడు బకాయిలను పెండింగ్‌లో పెట్టడం శోచనీయమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ(SFI) ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Fee reimbursement | మూడేళ్లుగా పెండింగ్‌లోనే..
ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. మూడేళ్లుగా స్కాలర్షిప్లను (Scholarships) పెండింగ్‌లో పెట్టిందని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొండిచేయి చూపడం అన్యాయమన్నారు. ఫలితంగా విద్యార్థుల సర్టిఫికెట్ల కోసం కాలేజీ యాజమాన్యాలు సతాయిస్తున్నాయని వాపోయారు. రూ.9 కోట్ల వరకు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ (SFI Kamareddy) జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్, నాయకులు స్టాలిన్, మణికంఠ, రాహుల్, నితిన్, నవీన్, సాయిప్రకాష్ గౌడ్, మణిరజ్, రాఘవ, ప్రభు, అర్జున్, సాయి తదితరులు పాల్గొన్నారు.