అక్షరటుడే, కామారెడ్డి: Fee Reimbursement | ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం(BC Student Union) జిల్లా అధ్యక్షుడు నాగరాజు కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బకాయిల కారణంగా ప్రైవేట్ కళాశాలలు సెమిస్టర్ పరీక్షలు(Semester exams) నిర్వహించలేకపోయాయన్నారు. ఈనెల 14 నుంచి పరీక్షలు జరపాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో విద్యార్థులు అయోమయంలో ఉన్నారన్నారు. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు ఉన్నత చదువులైన పీజీ, బీఈడీ నోటిఫికేషన్లు(BED Notification) వెలువడిన నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వం స్పందించి తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయాలని, కళాశాలల యాజమాన్యాలు పరీక్షలు సకాలంలో జరపాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్, రాము, ప్రభంజన్, రవి, రాజేందర్, కిరణ్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.