అక్షరటుడే, కామారెడ్డి: Fee reimbursement | పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ (fee reimbursement and scholarship) బకాయిలు విడుదల చేయాలని బీవీఎం రాష్ట్ర కార్యదర్శి విఠల్ డిమాండ్ చేశారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద విద్యార్థులతో కలిసి మంగళవారం ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు (educational institutions) ప్రభుత్వం బకాయి పడిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీపావళి వరకు రూ. 1200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట నిలుపుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
కళాశాలలకు రావాల్సిన బకాయిలు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడడం సరికాదన్నారు. కళాశాలల బంద్కు బీవీఎం పూర్తి మద్దతు ప్రకటిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బీవీఎం జిల్లా అధ్యక్షుడు ఆర్బాస్ ఖాన్, ఇన్ఛార్జి పెరుమాండ్ల బుల్లెట్, కార్యదర్శి శ్యాం, నాయకులు కార్తీక్, శివ, ప్రశాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.