అక్షరటుడే, వెబ్డెస్క్: February Wedding Muhurtham Dates | రాష్ట్రంలో పెళ్లి సందడి (Wedding Buzz) ప్రారంభం కానుంది. మూడు నెలల మూఢాలు మరో ఐదు రోజుల్లో ముగియనున్నాయి. సుముహూర్తాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో అనేక జంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నాయి.
మూడు నెలల విరామం తర్వాత శుభకార్యాల సందడి నెలకొంది. గతేడాది నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 13 వరకు మూఢం కావడంతో వివాహాది శుభాకార్యాలు ఆగిపోయాయి. మూఢాలు ముగిసిన ఈ నెల 18 వరకు మంచి ముహూర్తాలు లేవు. దీంతో అనేక మంది పెళ్లి నిశ్చయం అయిన ముహూర్తాలు లేకపోవడంతో వేచి చూస్తున్నారు. ఈ నెల 19 నుంచి మంచి రోజులు ఉండటంతో పెళ్లి సందడి నెలకొననుంది. ఇప్పటికే చాలా మంది పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఫంక్షన్ హాళ్లు (Function Halls) సైతం బుకింగ్ అయిపోయాయి. చాలా రోజుల విరామం తర్వాత వివాహాలకు మంచి రోజులు రావడంతో ఫంక్షన్ హాల్ కూడా దొరకడం లేదు.
February Wedding Muhurtham Dates | ముహూర్తాలు ఈ రోజుల్లో..
ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26. మార్చి 1, 3, 4, 7, 8, 9, 11, 12. ఏప్రిల్ 15, 20, 21, 25, 26, 27, 28, 29 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. అయితే ఫిబ్రవరి (February)లో చాలా వివాహాలు జరగనున్నాయి. ఇప్పటికే ముహూర్తాలు ఖరారు చేసుకొని పెళ్లి పనుల్లో చాలా మంది బిజీ అయిపోయారు. కొంతకాలంగా శుభకార్యాలు లేకపోవడంతో ఫంక్షన్ హాళ్లకు గిరాకీ కరువైంది. మరోవైపు ఇతర పెళ్లి పనులు చేసే వారు సైతం ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వరుస ప్రోగ్రామ్లతో వారు బిజీగా మారారు. మరోవైపు కొంత ఇంటికి భూమిపూజ, గృహ ప్రవేశాలు సైతం చేపట్టడానికి పలువురు సిద్ధం అయ్యారు.