Feb 25 Gold Prices | బంగారం ప్రియుల‌కి శుభ‌వార్త‌.. దిగి వ‌స్తున్న ధ‌ర‌.. తులం ఎంతంటే..!

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 25 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకపు విలువ మార్పులు, ప్రాఫిట్ బుకింగ్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల్లో మరోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 25న నమోదైన ధరల ప్రకారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1.61 లక్షల మార్క్ దాటింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు Silver Prices రోజువారీగా మార్పులను చవిచూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, అమెరికన్ డాలర్ మారకపు విలువ, […]

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 25 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకపు విలువ మార్పులు, ప్రాఫిట్ బుకింగ్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల్లో మరోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 25న నమోదైన ధరల ప్రకారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1.61 లక్షల మార్క్ దాటింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు Silver Prices రోజువారీగా మార్పులను చవిచూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, అమెరికన్ డాలర్ మారకపు విలువ, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ వంటి అంశాలు దేశీయ ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్‌ ప్రకారం ఫిబ్రవరి 25 ఉదయం నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

Feb 25 Gold Prices | ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

Hyderabadలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: రూ.1,61,790 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: రూ.1,48,310గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: రూ.1,21,350గా ట్రేడ్ అయింది. ఇవే ధరలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొనసాగుతున్నాయి.

వెండి ధర విషయానికి వస్తే కిలోకు రూ.2,84,900 వద్ద ట్రేడవుతోంది. వెండి ధరల్లో ఒక రోజు తగ్గుదల కనిపిస్తే, మరో రోజు పెరుగుదల కనిపించడం గమనార్హం.

  • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,61,940గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,48,460గా ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,61,790గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,48,310గా ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,62,450గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,48,910గా ట్రేడ్ అయింది. చెన్నైలో Chennai దేశంలోనే అత్యధిక ధర నమోదవ్వడం గమనార్హం.

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 5,119 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో ధరలు పెరిగితే దేశీయంగా కూడా పెరుగుతాయి. తగ్గితే ఇక్కడ కూడా తగ్గుదల కనిపిస్తుంది. భారతదేశం బంగారం అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. అందువల్ల డాలర్ మారకపు విలువ పెరగడం లేదా పడిపోవడం పసిడి ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

ఇటీవల బంగారం మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ పెరగడం వల్ల ఇన్వెస్టర్లు లాభాలను సాకారం చేసుకోవడానికి అమ్మకాలు చేపట్టారు. దీంతో ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. మరోవైపు అమెరికా America టారిఫ్ విధానాలపై కొనసాగుతున్న అనిశ్చితి కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది.

అమెరికన్ డాలర్ బలహీనత కూడా పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమైంది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొంత వెనుకంజ వేస్తుండగా, బంగారం ధరలు స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. మార్కెట్ ట్రెండ్‌ను గమనించి పెట్టుబడులు పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Related articles

Axis: ప్రయాణమే ఇక రివార్డుల మయం.. యాక్సిస్ బ్యాంక్, ఇండిగోల అదిరిపోయే క్రెడిట్ కార్డులు!

భారతదేశపు ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ మరియు అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) చేతులు కలిపాయి. ప్రయాణికుల అవసరాలను...

Snowstorm | అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. 11 వేల విమాన సర్వీసులు రద్దు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Snowstorm | ఈశాన్య అమెరికా America లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. గత మూడు రోజులుగా స్థానికంగా మంచు తుపాను...

T20 world Cup | టీ20 వరల్డ్‌కప్ నుంచి రింకూ సింగ్ ఔట్‌.. టీమిండియాకు పెద్ద షాక్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: T20 world Cup | టీ20 వరల్డ్‌కప్ సూపర్-8 దశలో కీలక సమయానికి టీమిండియాకు ఊహించని దెబ్బ తగిలింది. స్టార్ ఫినిషర్ రింకూ...

Rebirth of Punarvika | వెల్లివిరిసిన మానవత్వం.. పునర్వికకు పునర్జన్మ.. అందిన రూ. 16 కోట్ల విరాళాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rebirth of Punarvika | మానవత్వం వెల్లివిరిసింది. అడిగిన వెంటనే అతిపెద్ద భారీ సాయం విరాళాల ద్వారా అందింది. ఆ చిన్నారికి...