Feb 24 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ

Feb 24 Pre Market Analysis | గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది. యూఎస్ ప్రెసిడెంట్(US President) ట్రంప్ వివిధ దేశాలపై విధించిన టారిఫ్స్‌ను అక్కడి సుప్రీం కోర్టు కొట్టివేస్తూ తీర్పునివ్వడం, ట్రంప్ దానిపై అసహనం వ్యక్తం చేస్తూ ఆ వెంటనే 15 శాతం సుంకాలను ప్రకటించడంతో అనిశ్చిత వాతావరణం నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. యూఎస్‌తోపాటు యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. […]

Feb 24 Pre Market Analysis | గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది.

యూఎస్ ప్రెసిడెంట్(US President) ట్రంప్ వివిధ దేశాలపై విధించిన టారిఫ్స్‌ను అక్కడి సుప్రీం కోర్టు కొట్టివేస్తూ తీర్పునివ్వడం, ట్రంప్ దానిపై అసహనం వ్యక్తం చేస్తూ ఆ వెంటనే 15 శాతం సుంకాలను ప్రకటించడంతో అనిశ్చిత వాతావరణం నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. యూఎస్‌తోపాటు యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. మన మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Feb 24 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..

వివిధ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలను రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ అక్కడి సుప్రీం కోర్టు తీర్పునివ్వడం, అనంతర పరిణామాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో వాల్‌స్ట్రీట్(Wallstreet) భారీగా నష్టపోయింది. గత సెషన్‌లో నాస్‌డాక్ 1.21 శాతం, ఎస్అండ్ పీ 1.04 శాతం నష్టపోయాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.13 శాతం లాభంతో ఉంది.

Feb 24 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..

డీఏఎక్స్(DAX) 1.08 శాతం, సీఏసీ 0.22 శాతం, ఎఫ్టీఎస్ఈ 0.02 శాతం నష్టపోయాయి.

Feb 24 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో తైవాన్ Taiwan స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.52 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 1.38 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.98 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.49 శాతం లాభాలతో, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.75 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.99 శాతం ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ (Gift nifty)0.51 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 3,483.70 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు నికరంగా రూ. 1,292.24 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.98 నుంచి 1.06 కు పెరిగింది.
  • విక్స్ 1.36 శాతం తగ్గి 14.17 వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలపడి 90.88 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 71.67 డాలర్ల వద్ద ఉంది.
    నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ, మంత్లీ ఎక్స్‌పైరీల నేపథ్యంలో మార్కెట్‌లో తీవ్ర ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.

Related articles

Feb 24 Gold Prices | మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన ధ‌ర‌లు

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 24 Gold Prices | దేశంలో మళ్లీ బంగారం, వెండి ధరలు ప‌రుగులు పెడుతున్నాయి.. కాస్త తగ్గుతుందని సంతోషపడ్డ వినియోగదారుల్లో...

government employees welfare schemes | ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలు.. ఇకపై క్యాష్​లెస్​ వైద్యసేవలు

అక్షరటుడే, హైదరాబాద్​: government employees welfare schemes | ప్రభుత్వ ఉద్యోగుల భద్రత, సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు...

February 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 24 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 24,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

Second edition CM Cup | సెకండ్​ ఎడిషన్​ సీఎం కప్​ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు.. ప్రతిభ చూపిన కాకతీయ ఒలంపియాడ్​ విద్యార్థిని

అక్షరటుడే, ఇందూరు: Second edition CM Cup | హైదరాబాద్​లోని సరూర్​నగర్​ ఇండోర్ స్టేడియంలో ఈనెల 20 నుంచి సెకండ్ ఎడిషన్ సీఎం కప్...