అక్షరటుడే, న్యూఢిల్లీ: Feb 23 Pre Market Analysis | గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాల బాటలో సాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు సైతం భారీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) వివిధ దేశాలపై విధించిన రెసిప్రోకల్ టారిఫ్స్‌ను అక్కడి సుప్రీం కోర్టు కొట్టివేస్తూ తీర్పునివ్వడంతో యూఎస్ ఫ్యూచర్స్ మినహా ఇతర మార్కెట్లు భారీ లాభాలతో సాగుతున్నాయి. మన మార్కెట్లూ భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Feb 23 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలను అక్కడి సుప్రీంకోర్ట్ కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పు తర్వాత వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగిసింది. అయితే ఫ్యూచర్స్ మాత్రం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. గత సెషన్‌లో నాస్‌డాక్ 0.86 శాతం, ఎస్ అండ్ పీ 0.69 శాతం పెరిగాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.59 శాతం నష్టంతో ఉంది.
Feb 23 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
సీఏసీ 1.37 శాతం, డీఏఎక్స్(DAX) 0.86 శాతం, ఎఫ్టీఎస్ఈ 0.56 శాతం లాభపడ్డాయి.
Feb 23 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 2.74 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.20 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.07 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.32 శాతం లాభాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.70 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్ ఆప్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐ(FII)లు గత సెషన్‌లో నికరంగా రూ. 934.61 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు నికరంగా రూ. 2,637.15 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 30 పైసలు బలహీనపడి 90.98 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 71.24 డాలర్ల వద్ద ఉంది.
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై విధించిన టారిఫ్‌లు రాజ్యాంగ విరుద్ధమని యూఎస్ సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. అయితే తీర్పు వచ్చిన వెంటనే ట్రంప్ 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122ను అమలు చేశారు. ఈ సెక్షన్ ఆధారంగా 15 శాతం సుంకాలను పెంచారు.
- చైనా మార్కెట్లకు నూతన సంవత్సరం సెలవులు కొనసాగుతున్నాయి.
