అక్షరటుడే, న్యూఢిల్లీ: Feb 19 Pre Market Analysis | బలమైన ఆర్థిక డేటా కారణంగా వాల్‌స్ట్రీట్ పరుగులు తీసింది. టెక్ స్టాక్స్ సైతం పుంజుకున్నాయి. దీని ప్రభావంతో ఆసియా మార్కెట్లు సైతం పాజిటివ్‌గా సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.
Feb 19 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆందోళనతో వరుసగా నష్టపోతున్న టెక్ స్టాక్స్‌లో గత సెషన్లో రిలీఫ్ ర్యాలీ కనిపించింది. దీంతో నాస్డాక్ 0.83 శాతం పెరిగింది. ఎస్అండ్పీ 0.56 శాతం లాభపడింది. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.04 శాతం లాభంతో ఉంది.
Feb 19 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఎఫ్టీఎస్ఈ 1.22 శాతం, డీఏఎక్స్() 1.11 శాతం, సీఏసీ 0.80 శాతం పెరిగాయి.
Feb 19 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా దేశాలలో సెలవుల కారణంగా మార్కెట్లు తెరుచుకోలేదు. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.85 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.02 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.82 శాతం లాభాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.27 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్ ఆప్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా రెండో సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 1,154.34 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డీఐఐలు వరుసగా ఐదో సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉండి, రూ. 440.34 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో() 1.12 నుంచి 1.22 కు పెరిగింది.
- విక్స్ 3.55 శాతం తగ్గి 12.22 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 90.67 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 70.45 డాలర్లకు చేరింది.
చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్లలో నూతన సంవత్సరం సెలవుల కారణంగా అక్కడి స్టాక్ మార్కెట్లు మూసి ఉన్నాయి.