అక్షరటుడే, న్యూఢిల్లీ: Feb 18 Pre Market Analysis | గత సెషన్లో యూఎస్(US), యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. యూఎస్ ఫ్యూచర్స్‌తో పాటు గిఫ్ట్‌నిఫ్టీ పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Feb 18 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
టెక్నాలజీ షేర్లు పుంజుకోవడంతోపాటు ఫైనాన్షియల్ రంగ షేర్ల మద్దతుగా నిలవడంతో వాల్‌స్ట్రీట్ కోలుకుంది. గత సెషన్లో నాస్డాక్ 0.10 శాతం, ఎస్అండ్పీ 0.08 శాతం లాభపడ్డాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.01 శాతం నష్టంతో ఉంది.
Feb 18 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
డీఏఎక్స్(DAX) 0.79 శాతం, ఎఫ్టీఎస్ఈ 0.78 శాతం, సీఏసీ 0.54 శాతం పెరిగాయి.
Feb 18 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా దేశాలలో సెలవుల కారణంగా మార్కెట్లు తెరచుకోలేదు. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 1.24 శాతం, గిఫ్ట్ నిఫ్టీ 0.19 శాతం లాభంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ ఆప్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు గత సెషన్లో నికరంగా రూ. 995.21 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డీఐఐలు వరుసగా నాలుగో సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉండి, రూ. 187.04 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.11 నుంచి 1.12 కు పెరిగింది.
- విక్స్ 4.93 శాతం తగ్గి 12.67 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలహీనపడి 90.68 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 67.44 డాలర్ల వద్ద ఉంది.
చైనా, హాంగ్‌కాంగ్, సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియాలలో నూతన సంవత్సరం(New year) సందర్భంగా సెలవులు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడి స్టాక్ మార్కెట్లు మూసి ఉన్నాయి.