13
Feb 17 Pre market Analysis | గత సెషన్లో యూరోపియన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. యూఎస్‌కు చెండిన ఫ్యూచర్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కానున్నాయి.
Feb 17 Pre market Analysis | యూఎస్ మార్కెట్లు..
ప్రెసిడెంట్స్ డే సందర్భంగా సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లకు సెలవు. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.20 శాతం నష్టంతో ఉంది.
Feb 17 Pre market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఎఫ్టీఎస్ఈ 0.26 శాతం, సీఏసీ 0.06 శాతం పెరగ్గా.. డీఏఎక్స్() 0.46 శాతం నష్టపోయింది.
Feb 17 Pre market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా దేశాలలో సెలవుల కారణంగా మార్కెట్లు తెరచుకోలేదు. ఉదయం 8 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 0.87 శాతం, గిఫ్ట్ నిఫ్టీ 0.30 శాతం నష్టంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్డౌన్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు రెండో సెషన్లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు.
- గత సెషన్లో నికరంగా రూ. 972.13 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐ(DII)లు వరుసగా మూడో సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉండి, రూ. 1,999.98 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.65 నుంచి 1.11 కు పెరిగింది.
- విక్స్ 0.28 శాతం పెరిగి 13.33 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 90.65 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 68.49 డాలర్ల వద్ద ఉంది.
- జెనీవాలో అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు మంగళవారం జరగనున్నాయి. ఈ చర్చలలో తాను పరోక్షంగా పాల్గొంటానని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. ఇందులో అణు కార్యక్రమంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
- భారత్, యూఎస్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(Trade deal) కోసం భారత బృందం అమెరికాకు వెళ్లనుంది.
- భారతదేశ నిరుద్యోగ రేటు జనవరిలో స్వల్పంగా పెరిగింది. గత డిసెంబర్లో 4.8 శాతం ఉండగా.. జనవరిలో 5 శాతంగా నమోదయ్యింది.
- దిగుమతులు పెరగడతో జనవరిలో భారత్ వాణిజ్య లోటును ఎదుర్కొంటోంది. డిసెంబర్లో 25.05 బిలియన్ డాలర్లు ఉండగా.. ఇది జనవరికి 34.68 బిలియన్ డాలర్లకు పెరిగింది.
- చైనా(China), హాంగ్‌కాంగ్, సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియాలలో నూతన సంవత్సరం సందర్భంగా సెలవులు. దీంతో అక్కడి స్టాక్ మార్కెట్లు మూసి ఉన్నాయి.
- నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.