అక్షరటుడే, న్యూఢిల్లీ: Feb 16 Pre Market Analysis | యూఎస్, యూరోపియన్ మార్కెట్లు గత సెషన్లో మిక్స్‌డ్‌గా ముగిశాయి. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ సైతం నెగెటివ్‌గా ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ డౌన్లోన్లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Feb 16 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
జనవరి నెలలో అంచనాలకన్నా తక్కువ ద్రవ్యోల్బణం నమోదయ్యింది. దీంతో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఇన్వెస్టర్లలో మళ్లీ ఆశలు చిగురించాయి. గత సెషన్లో వాల్‌స్ట్రీట్ మిక్స్‌డ్‌గా ముగిసింది. ఎస్అండ్పీ 0.05 శాతం లాభపడగా., నాస్డాక్() 0.24 శాతం నష్టపోయింది. డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.16 శాతం లాభంతో ఉంది.
Feb 16 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు European markets..
సీఏసీ 0.35 శాతం నష్టపోగా.. ఎఫ్టీఎసఈ 0.42 శాతం, డీఏఎక్స్() 0.25 శాతం నష్టపోయాయి.
Feb 16 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు Asian markets..
ఉదయం 7.50 గంటల ప్రాంతంలో ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ఉన్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 0.20 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.09 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.07 శాతం నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.09 శాతం నష్టంతో ఉంది. ఇది మన మార్కెట్లు గ్యాప్డౌన్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు ఐదు సెషన్ల తర్వాత నికర అమ్మకందారులుగా మారారు.
- గత సెషన్లో నికరంగా రూ. 7,395.41 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు వరుసగా రెండో సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉండి, రూ. 5,553.96 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.82 నుంచి 0.65 కి పడిపోయింది.
- విక్స్(VIX) 13.37 శాతం పెరిగి 13.29 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు బలహీనపడి 90.64 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 67.62 డాలర్ల వద్ద ఉంది.
- జనవరిలో యూఎస్ సీపీఐ డాటా అంచనాలకన్నా తక్కువగా నమోదయ్యింది. 0.3 శాతం పెరుగుతుందని అంచనా వేయగా 0.2 శాతమే పెరిగింది. దీంతో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఇన్వెస్టర్లలో మళ్లీ ఆశలు చిగురించాయి.
- చైనాలో నూతన సంవత్సరం సందర్భంగా 16 నుంచి 23వ తేదీ వరకు అక్కడి స్టాక్ మార్కెట్లు పనిచేయవు.
- సౌత్‌కొరియా, తైవాన్లలో సెలవుల కారణంగా స్టాక్ మార్కెట్లు మూసి ఉన్నాయి.