అక్షరటుడే, హైదరాబాద్: Feb 15 Gold prices | దేశీయ బులియన్ మార్కెట్లో ఈరోజు (ఫిబ్రవరి 15) బంగారం ధరలు స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, యూఎస్ డాలర్ మార్పులు, వడ్డీ రేట్లపై అంచనాలు వంటి అంశాలకు అనుగుణంగా బంగారం ధరలు Gold Rates సున్నితంగా మారుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అయితే నిన్నటితో పోల్చితే ఈరోజు పెద్ద మార్పులు లేకపోవడం కొనుగోలుదారులకు కొంత ఊరట కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,57,750 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,600గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,18,310గా నమోదైంది. వెండి ధరలు కూడా పెద్ద మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
Feb 15 Gold prices |
ప్రధాన నగరాల్లో బంగారం ధరల ఇలా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్లు 10 గ్రాములు రూ.1,58,840, 22 క్యారెట్లు రూ.1,45,600గా ట్రేడ్ కాగా, ముంబైలో Mumbai 24 క్యారెట్లు రూ.1,57,750, 22 క్యారెట్లు రూ.1,44,600గా నమోదైంది.
ఢిల్లీలో 24 క్యారెట్లు రూ.1,57,900, 22 క్యారెట్లు రూ.1,44,750గా ట్రేడ్ కాగా, కోల్కతాలో 24 క్యారెట్లు రూ.1,57,750, 22 క్యారెట్లు రూ.1,44,600, బెంగళూరులో 24 క్యారెట్లు రూ.1,57,750 , 22 క్యారెట్లు రూ.1,44,600, హైదరాబాద్ లో 24 క్యారెట్లు రూ.1,57,750, 22 క్యారెట్లు రూ.1,44,600, విజయవాడలో 24 క్యారెట్లు రూ.1,57,750, 22 క్యారెట్లు రూ.1,44,600, విశాఖపట్నం లో 24 క్యారెట్లు రూ.1,57,750, 22 క్యారెట్లు రూ.1,44,600గా ఉంది.
మార్కెట్ Market వర్గాల ప్రకారం, ఇక్కడ పేర్కొన్న ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం ఆధారంగా మాత్రమే. అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు, కరెన్సీ విలువల్లో హెచ్చుతగ్గులు, స్థానిక డిమాండ్ వంటి అంశాలపై ఆధారపడి బంగారం-వెండి ధరలు ప్రతి క్షణం మారే అవకాశం ఉంది. కొనుగోలు చేయాలనుకునే వారు తుది ధరలను స్థానిక జువెలరీ దుకాణాల్లో నిర్ధారించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.