అక్షరటుడే, హైదరాబాద్: Feb 14 Gold Prices | దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు Silver Prices ఇటీవల పరుగులు పెట్టడం మనం చూశాం. ఆ తర్వాత ఇప్పుడు క్రమంగా దిగి వస్తుండటం వినియోగదారులకు ఊరటనిస్తోంది. భారతీయ సంప్రదాయంలో బంగారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో మహిళలు, కుటుంబాలు పెట్టుబడిగా కూడా దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.
అయితే గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటిన ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నిన్న ఒక్క రోజులోనే బంగారం ధరపై రూ.2 వేలకుపైగా తగ్గుదల నమోదు కావడం గమనార్హం. అదే సమయంలో వెండి ధరలో కూడా భారీ పతనం చోటుచేసుకుంది. కిలో వెండిపై సుమారు రూ. 20 వేల వరకు తగ్గుదల కనిపించింది.
Feb 14 Gold Prices : క్రమంగా తగ్గుదల..
ఫిబ్రవరి 14న దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,770 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,790 వద్ద నమోదైంది. వెండి ధర కూడా ఇదే విధంగా తగ్గుతూ ప్రస్తుతం కిలో సిల్వర్ ధర రూ.2,79,900 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల వారీగా ధరలు పరిశీలిస్తే ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,920 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,42,940గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,55,770, 22 క్యారెట్ల బంగారం రూ.1,42,790 వద్ద ఉంది. హైదరాబాద్లో కూడా ఇదే ధరలు కొనసాగుతుండగా, విజయవాడలోనూ 24 క్యారెట్ల బంగారం రూ.1,55,770, 22 క్యారెట్ల బంగారం రూ.1,42,790గా నమోదైంది.
చెన్నైలో మాత్రం స్వల్పంగా అధికంగా ఉండి 24 క్యారెట్ల బంగారం రూ.1,57,080, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,990గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,55,770, 22 క్యారెట్ల ధర రూ.1,42,790గా కొనసాగుతోంది. కేరళలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్లో Hyderabad కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,79,900 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ మార్పులు, డాలర్ విలువ హెచ్చుతగ్గులు, దిగుమతి సుంకాలు వంటి పలు అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధరలు తగ్గుతున్న ఈ సమయంలో వినియోగదారులు కొనుగోలు వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.