అక్షరటుడే, హైదరాబాద్: Feb 13 Gold Prices | కొద్ది రోజులుగా తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న బంగారం, వెండి ధరలు Silver Prices ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు విలువైన లోహాలు ఇటీవల రికార్డు గరిష్ఠాలను తాకిన తరువాత అదే వేగంతో క్షీణించగా.. ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, రాజకీయ పరిణామాల ప్రభావంతో స్థిరంగా కొనసాగుతున్నాయి.
బంగారం ధరలో శుక్రవారం స్వల్ప తగ్గుదల నమోదవగా, వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. ఈ రోజు (ఫిబ్రవరి 13) ఉదయం 6:30 గంటల సమయానికి 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,58,390కు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,190గా నమోదైంది.
Feb 13 Gold Prices | పెరుగుతున్న వెండి ధర..
దేశ రాజధాని ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,58,540కు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,340గా ఉంది. మరోవైపు వెండి ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై రూ.100 మేర పెరుగుదల నమోదై మళ్లీ మూడు లక్షల రూపాయల మార్క్‌కు చేరువైంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కేరళ, ఫుణె నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,58,390గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,45,190గా ఉంది. వడోదరలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,440 కాగా 22 క్యారెట్ల ధర రూ.1,45,240గా ఉంది.
ఢిల్లీలో ధరలు కొద్దిగా ఎక్కువగా నమోదయ్యాయి. వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళ Kerala నగరాల్లో కిలో వెండి ధర రూ.2,99,900గా ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,95,100గా కొనసాగుతోంది. మొత్తంగా బంగారం ధరలు స్వల్ప హెచ్చుతగ్గులతో స్థిరంగా ఉండగా, వెండి ధరలు మెల్లగా పెరుగుతూ పెట్టుబడిదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.