అక్షరటుడే, న్యూఢిల్లీ: Feb 12 Pre Market Analysis | యూఎస్, యూరోపియన్ మార్కెట్లు (European markets) మిక్స్‌డ్‌గా ముగిశాయి. గురువారం ఉదయం దక్షిణ కొరియా, సింగపూర్ మార్కెట్లు మినహా మిగతా ప్రధాన ఆసియా మార్కెట్లలోనూ జోష్ లేదు. గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) సైతం ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్‌గా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Feb 12 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
యూఎస్‌లో జాబ్ డేటా అంచనాలకన్నా బలంగా వచ్చింది. దీంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు తగ్గడంతో వాల్‌స్ట్రీట్ ఒత్తిడికి గురయ్యింది. గత సెషన్లో నాస్డాక్(Nasdaq) 0.11 శాతం నష్టంతో ఎస్ అండ్ పీ ఫ్లాట్‌గా ముగిశాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.18 శాతం లాభంతో ఉంది.
Feb 12 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఎఫ్టీఎస్ఈ 1.13 శాతం లాభంతో ముగియగా.. డీఏఎక్స్(DAX) 0.53 శాతం, సీఏసీ 0.18 శాతం నష్టపోయాయి.
Feb 12 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు..
గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.51 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.49 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.09 శాతం లాభాలతో ఉన్నాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.73 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.02 శాతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.04 శాతం నష్టంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఫ్లాట్ నెగెటివ్‌గా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా నాలుగో సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 943.81 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డీఐఐలు నికరంగా రూ. 125.36 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.17 నుంచి 1.06 కు తగ్గింది.
- విక్స్ 1.01 శాతం తగ్గి 11.55 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు బలహీనపడి 90.70 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.40 శాతం పెరిగి 69.64 డాలర్ల వద్ద ఉంది.
- ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 9.4 శాతం పెరిగి రూ. 19.44 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
- గతనెలలో యూఎస్‌లో జాబ్ డేటా పాజిటివ్‌గా వచ్చింది. నిరుద్యోగిత రేటు 4.4 శాతంనుంచి 4.3 శాతానికి తగ్గింది. దీంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న అంచనాలతో బంగారం ధర దిగివచ్చింది.
- సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.