అక్షరటుడే, హైదరాబాద్: Feb 12 Gold Prices | ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ఆర్థిక, భౌగోళిక, రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు Silver Prices రికార్డు గరిష్ఠాలను తాకిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొద్దికాలం తగ్గుదల కనిపించిన ఈ రెండు విలువైన లోహాల్లో ప్రస్తుతం బంగారం మళ్లీ పెరుగుతుండగా.. వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.
దేశీయ బంగారం మార్కెట్లో గురువారం స్వల్ప పెరుగుదల నమోదు కావడం గమనార్హం. ఫిబ్రవరి 12 ఉదయం 6:30 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,610కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,310 వద్ద కొనసాగుతోంది.
Feb 12 Gold Prices | స్థిరంగా వెండి ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,760గా నమోదవగా 22 క్యారెట్ల బంగారం రూ.1,46,460కి చేరింది. ఇదే సమయంలో వెండి ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. కిలోకు దాదాపు వంద రూపాయలు తగ్గి మళ్లీ మూడు లక్షల రూపాయల దిగువకు చేరుకోవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..
హైదరాబాద్, విజయవాడ, ముంబయి, కోల్కతా, చెన్నై, బెంగళూరు, కేరళ, పుణె Pune నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,610గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ.1,46,310గా కొనసాగుతోంది. వడోదరలో 24 క్యారెట్లు రూ.1,59,660, 22 క్యారెట్లు రూ.1,46,360గా నమోదయ్యాయి.
వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళ Kerala నగరాల్లో కిలో వెండి రూ.2,99,900గా ఉండగా ఢిల్లీ, కోల్కతా, ముంబయి, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్ నగరాల్లో కిలో వెండి రూ.2,89,900 వద్ద కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే బంగారం ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నప్పటికీ వెండి మాత్రం పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా ఉండటం మార్కెట్లో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.