అక్షరటుడే, న్యూఢిల్లీ: Feb 11 Pre Market Analysis | యూఎస్, యూరోపియన్ మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో ముగిశాయి. బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మాత్రం లాభాలతో సాగుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ సైతం లాభాలతో ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
Feb 11 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్() 0.58 శాతం, ఎస్అండ్పీ 0.36 శాతం నష్టపోగా.. డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.25 శాతం లాభంతో ఉంది.
Feb 11 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
సీఏసీ 0.06 శాతం పెరగ్గా.. ఎఫ్టీఎస్ఈ 0.31 శాతం, డీఏఎక్స్() 0.11 శాతం నష్టపోయాయి.
Feb 11 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు Asian markets..
సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రధాన ఆసియా మార్కెట్లు భారీ లాభాలతో ఉన్నాయి. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.81 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్() 0.21 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.11 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.05 శాతం లాభాలతో ఉన్నాయి. జపాన్‌లో పబ్లిక్ హాలిడే కారణంగా ఈరోజు మార్కెట్లు పనిచేయవు. గిఫ్ట్ నిఫ్టీ 0.34 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు లాభాలతో ప్రారంభం కానున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా మూడో సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 69.45 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డీఐఐలు నికరంగా రూ. 1,174.21 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.11 నుంచి 1.17 కు పెరిగింది.
- విక్స్ 4.31 శాతం తగ్గి 11.67 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు బలపడి 90.57 వద్ద ఉంది.
- యూఎస్, ఇరాన్‌ల మధ్య చర్చలు జరుగుతున్నా.. అనిశ్చితి తొలగడం లేదు. దీంతో క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతూనే ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 69.25 డాలర్ల వద్ద ఉంది.