అక్షరటుడే, హైదరాబాద్: Feb 11 Gold Prices | అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల ధోరణి వంటి అంశాల ప్రభావంతో బంగారానికి డిమాండ్ నిరంతరం కొనసాగుతోంది. గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు Silver Prices భారీగా పడిపోయినప్పటికీ ప్రస్తుతం మళ్లీ స్వల్పంగా పైకి ఎగబాకుతున్నాయి. ఫిబ్రవరి 11న దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తులం పై కేవలం రూ.100 మాత్రమే పెరగడంతో వినియోగదారులకు పెద్దగా భారం పడలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,790 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,45,560గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇదే ధరలు కనిపిస్తున్నాయి.
Feb 11 Gold Prices | నగరాల వారీగా..
హైదరాబాద్, విజయవాడ, ముంబై, చెన్నై Chennai, బెంగళూరు, కోల్కతా, కేరళ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,58,790 కాగా 22 క్యారెట్ల ధర రూ.1,45,560గా ఉంది. ఢిల్లీలో మాత్రం స్వల్ప తేడాతో 24 క్యారెట్ల బంగారం రూ.1,58,940, 22 క్యారెట్ల బంగారం రూ.1,45,710గా ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరల్లో స్వల్ప ఉపశమనం కనిపించింది. ఇటీవల కిలోకు రూ.4 లక్షల దాకా దూసుకెళ్లిన వెండి ధర ఇప్పుడు కొద్దిగా తగ్గి కిలోపై రూ.100 తగ్గుదల నమోదు చేసింది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2,99,900గా ఉండగా విజయవాడలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
ఢిల్లీ, ముంబై Mumbai నగరాల్లో కిలో వెండి రూ.2,89,900 వద్ద ట్రేడవుతోంది. ధరల్లో పెద్ద మార్పులు లేకపోయినా, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా బంగారం-వెండి ధరల్లో మరింత హెచ్చుతగ్గులు ఉండే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.