అక్షరటుడే, న్యూఢిల్లీ: Feb 10 Pre Market Analysis | యూఎస్‌తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లో సానుకూల దృక్పథం ఏర్పడింది. దీంతో ఎఫ్ఐఐలూ వరుసగా నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్నారు. మంగళవారం ఉదయం గ్లోబల్ మార్కెట్లు సైతం పాజిటివ్‌గా ఉండటంతో గిఫ్ట్‌నిఫ్టీ సైతం లాభాలతో ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు కూడా గ్యాప్‌అప్‌లో ప్రారంభం కానున్నాయి.
Feb 10 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు US Markets..
వాల్‌స్ట్రీట్‌లో లాభాలు కంటిన్యూ అవుతున్నాయి. గత సెషన్లో నాస్డాక్() 0.97 శాతం, ఎస్అండ్పీ 0.47 శాతం పెరగ్గా.. డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.03 శాతం లాభంతో ఉంది.
Feb 10 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు European Markets..
డీఏఎక్స్() 1.17 శాతం, సీఏసీ 0.59 శాతం, ఎఫ్టీఎస్ఈ 0.16 శాతం లాభపడ్డాయి.
Feb 10 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు Asian Markets..
సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రధాన ఆసియా మార్కెట్లు భారీ లాభాలతో ఉన్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 2.76 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.65 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.12 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.47 శాతం, చైనా china కు చెందిన షాంఘై 0.16 శాతం లాభాలతో సాగుతుండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.11 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్ నిఫ్టీ 0.40 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభం కానున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా రెండో సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 2,254.64 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డీఐఐలు నికరంగా రూ. 4.15 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో() 0.96 నుంచి 1.11 కు పెరిగింది. విక్స్ 2.09 శాతం పెరిగి 12.19 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలహీనపడి 90.77 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 69.01 డాలర్ల వద్ద ఉంది.
- నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.