అక్షరటుడే, వెబ్‌డెస్క్: Feb 09 Gold Prices | భారతీయ సంస్కృతిలో బంగారానికి Gold ప్రత్యేకమైన స్థానం ఉంది. వివాహాలు, శుభకార్యాలు, పండుగలు ఏవైనా బంగారం లేకుండా పూర్తికావు అనేంతగా మన జీవనశైలిలో అది భాగమైపోయింది. అయితే గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకుని సాధారణ ప్రజలకు అందని ద్రవ్యంగా మారాయి.
రెండు లక్షల రూపాయలకు చేరువలో ఉన్న బంగారం ధరలు, నాలుగు లక్షలు దాటిన వెండి ధరలు కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేశాయి. కానీ ఇప్పుడు మార్కెట్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, డాలర్ విలువలో మార్పులు, పెట్టుబడి ధోరణుల్లో వచ్చిన తేడాల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.
Feb 09 Gold Prices | తగ్గుముఖం..
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 9న బంగారం ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపించగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో Vijaywada 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,590గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,540గా కొనసాగుతోంది.
ఇదే ధరలు ముంబై, బెంగళూరు నగరాల్లో కూడా నమోదు కావడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,740గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,690గా ఉంది. చెన్నైలో మాత్రం స్వల్పంగా ఎక్కువగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,57,300గా, 22 క్యారెట్ల ధర రూ.1,44,190గా కొనసాగుతోంది.
ఇక వెండి ధరలు Silver Prices కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,84,900 వద్ద కొనసాగుతోంది. గతంలో భారీగా పెరిగిన ధరలతో కొనుగోలుకు వెనుకంజ వేసిన వినియోగదారులు ఇప్పుడు ఈ తగ్గుదలతో కొంత ఊరట పొందుతున్నారు.
ముఖ్యంగా వివాహాల సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరల తగ్గుదల కుటుంబాలకు ఆర్థికంగా ఉపశమనం కలిగించే అంశంగా మారింది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ పరిస్థితులు స్థిరంగా ఉంటే రాబోయే రోజుల్లో ధరలు ఇంకా కొంత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు, వినియోగదారులు ప్రస్తుతం మార్కెట్‌పై కన్నేసి పరిస్థితులను గమనిస్తున్నారు.