అక్షరటుడే, న్యూఢిల్లీ: Feb 02 Pre Market Analysis | గత సెషన్లో యూఎస్ మార్కెట్లు(US markets) నష్టాలతో.. యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం నష్టాల బాటలో పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) లాభంతో కనిపిస్తుండటంతో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Feb 02 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు US Markets..
ఫెడరల్ రిజర్వ్ మాజీ గవర్నర్ కెవిన్ వార్ష్‌ను ఫెడ్ ఛైర్మన్(Fed chairman)గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నామినేట్ చేయడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దీనిని హాకిష్ ఎంపికగా భావించి అమ్మకాలకు పాల్పడ్డారు. దీంతో గత సెషన్లో నాస్డాక్(Nasdaq) 0.95 శాతం, ఎసఅండ్పీ 0.43 శాతం నష్టపోయాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.36 శాతం నష్టంతో ఉంది.
Feb 02 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు.. European Markets
డీఏఎక్స్(DAX) 0.93 శాతం, సీఏసీ 0.68 శాతం, ఎఫ్టీఎస్ఈ 0.51 శాతం లాభపడ్డాయి.
Feb 02 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు Asian Markets..
ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో ఉన్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 0.21 శాతం లాభంతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.95 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.87 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 1.76 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.89 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.12 శాతం నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం 0.33 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు గత సెషన్లో నికరంగా రూ. 588 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు. డీఐఐలు వరుసగా రెండో సెషన్లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్లో రూ. 682 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.90 నుంచి 0.59 కు పడిపోయింది.
- విక్స్ 10.73 శాతం పెరిగి 15.10 వద్ద ఉంది. ఇది గతేడాది జూన్ 4 తర్వాత గరిష్టం.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 91.98 వద్ద ఉంది.
- ఇరాన్, వాషింగ్టన్ మధ్య వారాంతంలో చర్చలు జరుగుతాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో క్రూడ్ ఆయిల్ ధర శాంతించింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 2.32 శాతం తగ్గి, 65.98 డాలర్ల వద్ద ఉంది.