అక్షరటుడే, హైదరాబాద్: Feb 02 Gold Prices | బంగారం, వెండి ధరలు Silver Prices ఇటీవల రోజుల్లో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం వరకు వరుసగా పెరుగుదల చూపిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఈ వారం తగ్గడం ప్రారంభించడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరిగింది.
ముఖ్యంగా వివాహాలు, శుభకార్యాల సీజన్ సమీపిస్తుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూల సమయమని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 1న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు సోమవారం కూడా డౌన్ ట్రెండ్‌లోనే కొనసాగాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఫిబ్రవరి 2న బంగారం ధరలు..
- హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,60,570 వద్ద కొనసాగుతుండగా, నిన్న ఇదే ధర రూ.1,60,580గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,190 వద్ద ఉంది, ఆదివారం ఇది రూ.1,47,200గా నమోదైంది.
- విజయవాడ, విశాఖపట్నం Vishakapatnam నగరాల్లో కూడా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,60,570 వద్దనే కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,190గా ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.1,62,540గా ఉండగా, నిన్న రూ.1,62,550గా ఉంది. అక్కడ 22 క్యారెట్ల బంగారం రూ.1,48,990 వద్ద కొనసాగుతుండగా, నిన్న ఇది రూ.1,49,000గా నమోదైంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,570గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,190గా ఉంది.
- దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,60,720గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,340గా కొనసాగుతోంది.
Feb 02 Gold Prices | వెండి ధర మాత్రం..
ఇక వెండి ధరల Silver Rates విషయానికి వస్తే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.3,49,900గా ఉంది, నిన్న ఇది రూ.3,50,000గా నమోదైంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.3,19,900 వద్ద కొనసాగుతుండగా, ఆదివారం ఇది రూ.3,20,000గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.3,19,900 వద్ద ఉండగా, బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.3,49,900గా కొనసాగుతోంది. మొత్తం మీద అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ మారకపు విలువల్లో మార్పులు, కేంద్ర బ్యాంకుల విధానాలు బంగారం, వెండి ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుండగా, ధరలు తగ్గుముఖం పడటం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది.