అక్షరటుడే, న్యూఢిల్లీ: Feb 01 Pre Market Analysis | గత సెషన్లో యూఎస్ మార్కెట్లు(US markets) నష్టాలతో.. యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. చివరి సెషన్లో ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో పయనించాయి. కాగా బడ్జెట్ డే రోజున గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) మాత్రం స్వల్ప లాభంతో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్ టు పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Feb 01 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
ఫెడరల్ రిజర్వ్ మాజీ గవర్నర్ కెవిన్ వార్ష్‌ను ఫెడ్ ఛైర్మన్‌గా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ నామినేట్ చేయడంతో వాల్‌స్ట్రీట్ నెగెటివ్‌గా స్పందించింది. ఈ నిర్ణయాన్ని పెట్టుబడిదారులు హాకిష్ ఎంపికగా భావించారు. దీంతో గత సెషన్లో నాస్డాక్(Nasdaq) 0.95 శాతం, ఎసఅండ్పీ 0.43 శాతం నష్టపోయాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.36 శాతం నష్టంతో ఉంది.
Feb 01 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
డీఏఎక్స్(DAX) 0.93 శాతం, సీఏసీ 0.68 శాతం, ఎఫ్టీఎసఈ 0.51 శాతం లాభపడ్డాయి.
Feb 01 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు..
ఉదయం 8.10 గంటల ప్రాంతంలో ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో ఉన్నాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 2.02 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.97 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.51 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.10 శాతం నష్టాలతో, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ ఫ్లాట్‌గా ముగిశాయి. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం 0.06 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫఐఐలు గత సెషన్లో నికరంగా రూ. 2,251 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. డీఐఐలు దాదాపు మూడున్నర నెలల తర్వాత తొలిసారిగా నికర అమ్మకందారులుగా మారారు. గత సెషన్లో రూ. 601 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలహీనపడి 91.98 వద్ద నిలిచింది.
- క్రూడ్ ఆయిల్ ధర ఆందోళన కలిగిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 69.82 డాలర్ల వద్ద ఉంది.
- బడ్జెట్డే కావడంతో మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి.