HomeUncategorizedDonald Trump | ట్రంప్‌, నేత‌న్యాహుకు వ్య‌తిరేకంగా ఫ‌త్వా.. ఇద్దరినీ ఓడించాల‌ని ఇరాన్ మ‌త పెద్ద...

Donald Trump | ట్రంప్‌, నేత‌న్యాహుకు వ్య‌తిరేకంగా ఫ‌త్వా.. ఇద్దరినీ ఓడించాల‌ని ఇరాన్ మ‌త పెద్ద పిలుపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఇజ్రాయిల్ ప్ర‌దాని బెంజిమిన్ నేత‌న్యాహుకు(PM Benjamin Netanyahu) వ్య‌తిరేంగా ఇరాన్‌కు చెందిన ముస్లిం మ‌త పెద్ద ఒక‌రు ఫ‌త్వా(Fatwa) జారీ చేశారు. వారిద్ద‌రిని శ‌త్రువులుగా పేర్కొంటూ, వారిని ఓడించాల‌ని పిలుపునిచ్చారు. ఇరాన్‌పై ఇటీవ‌ల దాడుల‌కు దిగిన ఇజ్రాయిల్‌, అమెరికా అధ్య‌క్షుల‌కు వ్య‌తిరేంగా ఇరాన్ అగ్రశ్రేణి షియా మత పెద్ద గ్రాండ్ అయతుల్లా నాసర్ మకరెం షిరాజీ(Ayatollah Nasser Makarem Shirazi) ఈ ఫ‌త్వాను జారీ చేశారు. వారిని “దేవుని శత్రువు” అని అభివర్ణించారు. ఆ ఇద్ద‌రిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను చర్య తీసుకోవాలని కోరారు. ఇస్లామిక్ నాయ‌క‌త్వాన్ని బెదిరిస్తున్న ఇరు దేశాల నాయ‌కుల‌ను ఓడించాల‌ని పిలుపునిచ్చారు.

Donald Trump | శ‌త్రువులను ఓడించాలి..

ఇజ్రాయిల్‌(Israel), అమెరికాల‌కు ఇస్లామిక్ దేశాలు స‌హ‌కారం అందించ‌డం నిషిద్ధ‌మ‌ని, వారు చేసిన త‌ప్పుల‌కు ప‌శ్చాత్తాప‌ప‌డేలా చేయ‌లం అవ‌స‌ర‌మ‌ని షిరాజీ పేర్కొన్నారు. ఇస్లామిక్ రిప‌బ్లిక్(Islamic Republic) పై దాడుల‌కు దిగిన వారిని ఉపేక్షించ‌బోమ‌ని పేర్కొన్నారు. “నాయకుడిని లేదా మార్జాను (దేవుడు నిషేధించాలి) బెదిరించే ఏ వ్యక్తి లేదా పాలననైనా ‘యుద్ధనాయకుడు’ లేదా ‘మొహరేబ్’గా పరిగణిస్తారు” అని మకరెం ఫత్వాలో పేర్కొన్నారు. మొహరేబ్(Mohareb) అంటే దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే వ్యక్తి., ఇరానియన్ చట్టం ప్రకారం, మొహరేబ్‌గా గుర్తించబడిన వారు ఉరిశిక్ష, శిలువ వేయడం, అవయవాలను న‌రికివేయ‌డం, లేదా బహిష్కరించబడతారని ఫాక్స్ న్యూస్ నివేదిక తెలిపింది.

Donald Trump | ఫత్వా అంటే ఏమిటి?

ఫత్వా అనేది.. ట్వెల్వర్ షియా ఇస్లాం(Twelver Shia Islam)లో అత్యున్నత మతాధికారాన్ని కలిగి ఉన్న మార్జా జారీ చేసిన ఇస్లామిక్ చట్టంలోని ఒక అంశంపై అధికారిక వివరణ లేదా తీర్పు. ఇస్లామిక్ ప్రభుత్వాలు, వ్యక్తులతో సహా అన్ని ముస్లింలు దాన్ని పాటించాల‌ని ఇది పిలుపునిస్తుంది. హింసను ప్రేరేపించడానికి ఇరానియన్ మతాధికారులు ఫత్వాలను జారీ చేయ‌డం ఇదే మొదటిసారి కాదు. “ది సాటానిక్ వెర్సెస్”(The Satanic Verses) నవల విడుదలైన తర్వాత దాన్ని ర‌చించిన స‌ల్మాన్ ర‌ష్దీకి వ్య‌తిరేకంగా 1989లో జారీ చేసిన ఫ‌త్వా అత్యంత అపఖ్యాతి పాలైంది. దీనిపై చాలా మంది ముస్లింలే అభ్యంతరం తెలిపారు. ఆ ఫత్వా కార‌ణంగా రష్దీ అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, జపనీస్‌లోకి అనువాదించిన వ్య‌క్తి హత్యకు దారితీసింది పుస్తక ప్రచురణకర్తలపై చాలా దాడులు జ‌రిగాయి. రష్దీపై చాలా హ‌త్యా ప్ర‌య‌త్నాలు జ‌రుగ‌గా, ఆయ‌న తృటిలో త‌ప్పించుకున్నారు. 2023లో న్యూయార్క్ లో జరిగిన కత్తిపోటు దాడిలో ఆయన ఒక కన్ను కోల్పోయారు.

Must Read
Related News