HomeUncategorizedEgypt | నిజంగా హ్యాట్సాఫ్‌.. ప‌ట్టాల‌పై ప‌డ్డ బిడ్డ‌ను ప్రాణాల‌కు తెగించి కాపాడిన తండ్రి

Egypt | నిజంగా హ్యాట్సాఫ్‌.. ప‌ట్టాల‌పై ప‌డ్డ బిడ్డ‌ను ప్రాణాల‌కు తెగించి కాపాడిన తండ్రి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Egypt | బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకునే వాడే తండ్రి. అయితే ఈ రోజుల్లో క‌న్న‌బిడ్డ‌ల‌ను క‌నిక‌రం లేకుండా చంపేస్తున్న వారిని అక్కడక్కడా చూస్తున్నాం.. కానీ ఈ తండ్రి మాత్రం ప‌ట్టాల‌పై ప‌డిన బిడ్డ‌ను ప్రాణాల‌కు తెగించి కాపాడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈజిప్ట్(Egypt) రాజధాని కైరోలో ఓ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఓ యువతి రైల్వే ప్లాట్‌ఫాం(Railway platform) నుంచి పట్టాలపై పడిపోయింది. ఇదే సమయంలో వేగంగా రైలు(Train) సమీపించింది. అది గమనించిన తండ్రి ఏమాత్రం వెనుకాడకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి కింద‌కు దూకి కూతురిని కాపాడాడు.

Egypt | గ్రేట్ ఫాద‌ర్..

త‌న కూతురిని గ‌ట్టిగా ప‌ట్టుకొని ప్లాట్ ఫామ్, రైల్వే ట్రాక్ (Railway track) మ‌ధ్య ఉన్న గ్యాప్‌లో అలానే రైలు వెళ్లేంత వ‌ర‌కు ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొంద‌రు త‌మ ఫోన్స్​లో రికార్డు చేయ‌గా, అవి ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్నాయి. తండ్రి ధైర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజ‌న్లు మెచ్చుకుంటున్నారు. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిగా మారుతున్న రోజులివి. అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమేస్తున్నారు. అలాంటి ఈ రోజుల్లో తండ్రి సాహ‌సాన్ని మెచ్చుకు తీరాల్సిందే.

రీసెంట్‌గా కృష్ణా జిల్లా మైలవరం(Krishna district Mylavaram)లో ఓ తండ్రి చేసిన ఘ‌ట‌న అంద‌రి మ‌న‌సులు క‌లిచివేసింది. ఆర్థిక సమస్యలు (Financial problems), కుటుంబ లోపాల మధ్య నలిగిపోయిన ఓ వ్యక్తి తన ఇద్దరు చిన్నారులను విషం పెట్టి చంపి, తాను ఎక్కడికో వెళ్లిపోయాడు. మైలవరం ప్రాంతానికి చెందిన రవిశంకర్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలు లీలా సాయి (7) మరియు హిరణ్య (5) కు భోజనంలో విషం ఇచ్చి హత్య చేశాడు. తాను చనిపోతున్నానంటూ ఒక లేఖ రాసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఐదు రోజుల పాటు ఇంటి తలుపులు మూసివుండటంతో పక్కింటివారు అనుమానంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపులు బద్దలుకొట్టేసరికి.. ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో పిల్లల మృతదేహాలు గుర్తించారు. భార్య మృతి అనంతరం ఒంటరిగా పిల్లలను పెంచుతూ వస్తున్న రవిశంకర్, ఇటీవల తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనై ఇలా చేశాడ‌ని అంటున్నారు. మ‌రి అతను ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఎక్కడికైనా పారిపోయాడా అన్నది ఇంకా స్పష్టత లేదు.

Must Read
Related News