ePaper
More
    Homeక్రైంNagireddypet | భార్యపై కోపంతో నాలుగేళ్ల కొడుకును చంపిన తండ్రి

    Nagireddypet | భార్యపై కోపంతో నాలుగేళ్ల కొడుకును చంపిన తండ్రి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి :Nagireddypet | భార్యపై కోపాన్ని నాలుగేళ్ల కుమారుడిపై చూపించాడో తండ్రి. మానవత్వం మరిచి కన్న కొడుకునే హతమార్చాడు. ఈ ఘటన నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామం(Pocharam village)లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన నర్వ అనిల్​కు నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన అక్షితతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు శశాంక్​, ఏడు నెలల కూతురు ఉన్నారు.

    దంపతులు ఇద్దరు తమ పిల్లలతో కలిసి మంగళవారం మెదక్ జిల్లా శాలిపేట గ్రామంలో బోనాల పండుగకు వెళ్లారు. అక్కడ అనిల్​ చెల్లె కూతురిని శశాంక్​ మెట్లపై నుంచి తోసేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. బుధవారం అనిల్​ తన భార్య పిల్లలతో పొల్కంపేటకు వచ్చాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో అనిల్​ తన భార్యను కొట్టాడు. అనంతరం వైద్యం చేయిస్తానని చెప్పి గురువారం అక్షితను పోచారంలోని తల్లిగారింటికి తీసుకొచ్చాడు. అక్కడ ఆమెకు ఆస్పత్రిలో చికిత్స చేయించాడు.

    కాగా.. తన కుమారుడిని తీసుకొని వెళ్లిన అనిల్ గ్రామ శివారులో ముక్కు నోరు మూసి చంపేశాడు. అనంతరం ఇంటికి తీసుకు వెళ్లాడు. కాగా.. బాబు అచేతనంగా పడి ఉండడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అనిల్​ను నిలదీయగా భార్యపై కోపంతో తానే ముక్కు మూసి హత్య చేసినట్లు చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు అక్షిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ నాయక్(CI Ravinder Naik) తెలిపారు.

    More like this

    Lonely Journey | ప్రయాణం ఒంటరిదే కానీ.. ప్రయోజనాలు అనేకమాయే!

    అక్షరటుడే, హైదరాబాద్ : Lonely Journey | ఒంటరిగా ప్రయాణించడం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు. అది...

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...