అక్షరటుడే, హైదరాబాద్: Father crushed to death by vehicle : పేదరికంలో పుట్టిన తన కొడుకును అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ముద్దులొలికే ఆ చిన్నారి భవిష్యత్తు కోసం విధులకు బయలుదేరాడు.
కానీ, ఆ తొందరలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. చూసుకుని ఉంటే పెద్ద ప్రమాదమే తప్పేది. చిన్నపాటి నిర్లక్ష్యం ఒక జీవితాన్నే తుదుముట్టించింది.
తండ్రి పని మీద బయటకు వెళ్తుంటే.. వెంటే వద్దామని అనుకున్నాడో.. లేక నాన్నకు టాటా చెబుదామని భావించాడో.. కానీ బుడిబుడి నడకలతో పరుగున బయటకు వచ్చాడు.
కానీ, ఆ తండ్రి గమనించకపోవడం ఆ చిన్నారి బాలుడికి శాపంగా మారింది. నాన్న నడిపే వాహనం కిందే పడిపోయి ప్రాణాలు విడిచాడు ఆ చిన్నారి.
రంగారెడ్డి Rangareddy జిల్లా అబ్దుల్లాపూర్మట్ Abdullahpurmat మండలంలో దారుణం జరిగింది. 13 నెలల బాలుడిని తండ్రే పొరపాటున పొట్టనబెట్టుకున్న దుస్థితి.
పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి జిల్లా Yadadri district రామన్నపేటకు చెందిన నరేశ్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. నరేశ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కరూడ రోడ్డులోని ఎస్బీఐ ఎదురుగా ఉన్న గుడిసెల్లో ఈ కుటుంబం నివాసం ఉంటోంది.
కాగా, సోమవారం (సెప్టెంబరు 1) నరేశ్ పనికి బయలుదేరాడు. గుడిసె ముందట పార్క్ చేసిన గూడ్స్ ట్రాలీని వెనక్కి తీస్తుండగా.. చిన్న కుమారుడు లోహిత్(13 నెలలు) గుడిసెలో నుంచి బయటకు వచ్చాడు.
Father crushed to death by vehicle : చిన్నపాటి నిర్లక్ష్యం.. నిండుప్రాణం బలి..
బాలుడు వస్తున్న విషయాన్ని నరేశ్ గమనించకుండా వెనక్కి తీశాడు. దీంతో అదే సమయంలో లోహిత్ వెనక్కి రావడంతో వాహనం తలిగి కిందపడిపోయాడు. వాహనం అలానే వెనక్కి రావడంతో దాని వెనుక చక్రాల కింద నలిగిపోయాడు.
కొడుకు ప్రాణాలు పోయాక గమనించిన నరేశ్.. వాహనం పక్కనబెట్టి పరుగున కొడుకు వద్దకు చేరుకున్నాడు. విగత జీవిగా మారిన తన గారాలపట్టిని ఒళ్లోకి తీసుకుని గుండెలవిసేలా విలపించాడు.
పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రాథమిక విచారణ చేపట్టి, పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.