HomeతెలంగాణOnline Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​కు డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై దాడి

Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​కు డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై దాడి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​ కుబుంబాల్లో చిచ్చు పెడుతోంది. ఈజీ మనీ(Easy Money) కోసం బెట్టింగ్​ బానిసై ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు అప్పులు చేసి తనువు చాలిస్తుండగా.. మరి కొందరు కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లా(Jagityala District)లో చోటు చేసుకుంది.

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పాత కోర్టు భవనం సమీపంలో రాచకొండ దేవభూమయ్య (62) అనే వ్యక్తి తన కుమారుడు నవీన్ (33) నివాసముంటున్నారు. అయితే నవీన్​ కొంత కాలంగా మద్యం, ఆన్​లైన్​ బెట్టింగ్(Online Betting)​కు బానిసయ్యాడు. బెట్టింగ్​ డబ్బులు పోగొట్టుకున్నాడు.

ఈ క్రమంలో గురువారం బెట్టింగ్​ కోసం డబ్బులు కావాలని తండ్రిని అడిగాడు. లేవని చెప్పడంతో నవీన్ తన​ తండ్రిపై కత్తితో దాడి చేశాడు. అయితే ఈ సందర్భంగా జరిగిన గొడవలో తండ్రీకొడుకులు ఇద్దరికి గాయాలు అయ్యాయి. దేవభూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు(Police) తెలిపారు.