ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

    Banswada | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

    వర్ని మండలం హుమ్నాపూర్​, బోధన్​ మండలం(Bodhan Mandal) బెల్లాల్​కు చెందిన పలువురు మహారాష్ట్రలోని పాలజ్​ గణేష్ మందిరానికి(Palaj Ganesh Temple) వెళ్లారు. తిరిగి వస్తుండగా వీరి కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది. నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్ తరోడ్ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

    ప్రమాదంలో వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామానికి(Humnapur Village) చెందిన ఇద్దరు, బోధన్ మండలం బెల్లాల్​కు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. చేకూరి బుల్లి రాజు (50), అతని భార్య సునీత ( 45), వాణి (38) మృతి చెందగా గున్నం చంద్రశేఖర్ (35), నీలిమ (45)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్, బైంసా ఆస్పత్రులకు తరలించారు. రోడ్డు ప్రమాదంతో దంపతులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

    More like this

    High-Speed Road Network | హై స్పీడ్ రోడ్ నెట్ వర్క్ విస్తరణపై కేంద్రం దృష్టి .. 125 బిలియన్ డాలర్లతో ఆధునికీకరణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High-Speed Road Network | దేశంలో హై-స్పీడ్ రోడ్ నెట్వర్క్ను మరింత విస్తరించడంపై కేంద్ర...

    Collector Nizamabad | వరద తాకిడి ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలి

    అక్షరటుడే, ఇందల్వాయి: Collector Nizamabad | ఇటీవల వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపర్చాలని కలెక్టర్​ వినయ్​...

    Stock Markets | ఎగసి ‘పడి’.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | జీఎస్టీ సరళీకరణతో భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌...