అక్షర టుడే నిజాంసాగర్: Nizamsagar | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద కొడప్గల్ (Peddagodapkal) గ్రామ శివారులో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద వైపు నుంచి పిట్లం వైపునకు వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై ఓ వంతెనను ఢీకొట్టింది. దీంతో లారీలో ఉన్న నలుగురు వ్యక్తులు లారీ ముందు అద్దాలు పగిలి అందులో నుంచి రహదారి కింద సర్వీస్రోడ్డుపై పడ్డారు.
లారీలో ప్రయాణిస్తున్న పోతిరెడ్డిపల్లి (Pothireddy pally) గ్రామానికి చెందిన ఒకరు ఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు క్షతగాత్రులను 108లో పిట్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీలో ఇటుక లేదా ఉనుకను తరలిస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై అరుణ్ కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.