Homeక్రైంNH 44 | హైవేపై రోడ్డు ప్రమాదం.. మూడు కార్లను ఢీకొట్టిన లారీ..

NH 44 | హైవేపై రోడ్డు ప్రమాదం.. మూడు కార్లను ఢీకొట్టిన లారీ..

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రాయన్ పల్లి (Chandrayanpalli) వద్ద ఓ లారీ మూడు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఇందల్వాయి మండలం (Indalwai mandal) చంద్రాయన్​పల్లి వద్ద మంగళవారం సాయంత్రం నిమాబాద్​ వైపు నుంచి హైదరాబాద్​ వైపు వెళ్తున్న ఓ లారీ వెనుక వైపు ముందు వెళ్తున్న మూడు కార్లను ఢీకొట్టింది. అంతేకాకుండా.. కార్లను ఢీకొని లారీ ఆగిపోవడంతో వెనుక నుంచి వచ్చిన మరో లారీ దానిని ఢీకొట్టింది. అలాగే ఈ ఘటనలో ఓ బైకుపై వెళ్తున్న వారు సైతం ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు భారీగా ధ్వంసమయ్యాయి.

కాగా.. ఒక కారు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఇందులో ఉన్న కామారెడ్డికి వెళ్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. మరో కారులో హైదరాబాద్​ వెళ్లే కారు పూర్తిగా ధ్వంసం కాగా.. అందులో ఉన్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. అలాగే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు దంపతులకు గాయాలవడంతో అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు. వీరు కామారెడ్డి జిల్లా (Kamareddy district) సదాశివనగర్ మండలంలోని ఉత్తనూర్ గ్రామానికి చెందిన వారిని సమాచారం.

భారీ ప్రమాదం జరగడంతో రోడ్డుపై కొద్దిసేపు భారీగా ట్రాఫిక్​ జాం (heavy traffic jam) అయ్యింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Must Read
Related News